ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పోర్టల్
సెంట్రల్ వర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ చెప్పారు. శుక్రవారం ‘సంవాద్' పేరుతో యూట్యూబ్లో నిర్వహించిన లైవ్లో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
- యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్కుమార్
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ వర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ చెప్పారు. శుక్రవారం ‘సంవాద్’ పేరుతో యూట్యూబ్లో నిర్వహించిన లైవ్లో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 35 శాతం ఖాళీలు ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా నింపుతామని వెల్లడించారు. దరఖాస్తులను కేంద్రీకృత పద్ధతిలో స్వీకరించినా, భర్తీ మాత్రం వర్సిటీలవారీగానే ఉంటుందని చెప్పారు. పోర్టల్లో వర్సిటీలవారీగా ఖాళీల వివరాలుంటాయని, నోటిఫికేషన్ వెలువడగానే ఆటో ఈ మెయిల్ ద్వారా అభ్యర్థులకు సమాచారం అందుతుందని తెలిపారు. అభ్యర్థులు తమ అర్హతల మేరకు ఒకటి లేదా రెండు మూడు వర్సిటీలకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
త్వరలోనే సీయూఈటీ పీజీ నోటిఫికేషన్
సెంట్రల్ వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్ల్లో ప్రవేశాలకు నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీస్ కామ న్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)కు 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని జగదీశ్కుమార్ చెప్పారు. త్వరలోనే సీయూఈటీ పీజీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ నెట్ వయోపరిమితిని పెంచాలనే అంశంపై అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రిసెర్చ్ను ప్రోత్సహించడంలో భాగంగా రిటైర్డ్ ఆచార్యుల కోసం ప్రత్యేక పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

