నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 4 (నమస్తే తెలంగాణ): మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ మృతి కేసులో నిందితుడు పూర్ణచందర్ ను విచారణ నిమిత్తం 3 రోజులపా టు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, మంచి వాతావరణంలో విచారణపూర్తి చేయాలని సూచించింది. దీంతో శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి పూర్ణచందర్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు.. సీన్ రీ కన్స్ట్రక్షన్ ద్వారా సాక్ష్యాధారాలను సేకరించడంతోపాటు నిందితుడిని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి విచారణ జరుపనున్నట్టు తెలుస్తున్నది.