హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన శనివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆది, సోమవారాల్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశమిచ్చారు. 13లోపు తుది విడత సీట్లను కేటాయిస్తారు. వివరాలకు https://tgpolycet. nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని శ్రీదేవసేన సూచించారు.
అప్గ్రేడ్చేసి పదోన్నతులు ఇవ్వండి
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): భాషాపండితుల అప్‌గ్రేడేషన్ పూర్తికాగా మిగిలినవాటిని స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)గా అప్గ్రేడ్చేసి పదోన్నతులు కల్పించాలని ఆర్‌యూపీపీ టీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. శనివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీ జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సింహులు, కోశాధికారి కట్టా గిరిజారమణశర్మ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఎస్జీటీలను రిలీవ్ చేయాలి: బీసీటీఏ
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): టీచర్ల బదిలీల్లో ట్రాన్స్ఫర్ అయిన ఎస్జీటీలను రిలీవ్‌చేసి, ఆయా స్థానాల్లో విద్యావలంటీర్లను నియమించాలని బహుజన క్లాస్ టీచర్స్ అసొసియేషన్ (బీసీటీఏ) కోరింది. రిలీవ్‌చేసిన వారు కొత్త స్థానాల్లో చేరేలా ఆదేశాలు ఇవ్వాలని బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కే కృష్ణుడు, ప్రధాన కార్యదర్శి ఏ లక్ష్మణ్‌గౌడ్ శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.