పర్యావరణం పదిలం

- హరితహారం, చెరువుల రక్షణతోనే సాధ్యమైంది
- కేసీఆర్ కృషితోనే కాలుష్యరహిత హైదరాబాద్
- ఉస్మానియా విశ్రాంత ప్రొఫెసర్ సీ వెంకటేశ్వర్
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 5: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలతో రాష్ట్రం, ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం కాలుష్యరహితంగా మారిందని ఉస్మానియా యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, బోటనీ విభాగాల మాజీ హెడ్ ప్రొఫెసర్ సీ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా భారీస్థాయిలో మొక్కలు పెంచడం, చెరువులు, కుంటలు సహా నీటివనరుల పరిరక్షణతో పర్యావరణం పదిలంగా ఉన్నదని ప్రశంసించారు. దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం టెన్ పాయింట్ వింటర్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిందని, కోటిన్నర జనాభాతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ఎన్నో పరిశ్రమలు ఉన్నప్పటికీ కాలుష్యం తక్కువగా ఉండటానికి సీఎం కేసీఆర్ కృషే కారణమని కొనియాడారు. మొక్కలు నాటడంలో ప్రపంచంలో మూడో అతి పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. హరితహారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం హరితనిధిని ప్రారంభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇండ్లల్లో స్వచ్ఛమైన గాలి కోసం అక్వేరియం ఏర్పాటుచేసి, ఆ నీటిలో సున్నం కలిపి బయట నుంచి గాలి వచ్చేలా చేస్తే గాలిలోని వ్యర్థాలు నీటిలో కలిసిపోయి శుద్ధమైన గాలి లభిస్తుందని తెలిపారు. గార్డెన్లలో సున్నం కలిపిన నీటిని పిచికారీ చేసినా కాలుష్యం తగ్గుముఖం పడుతుందని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

