కొనసాగుతున్న మునుగోడు పోలింగ్.. 9 వరకు 11.2శాతం పోలింగ్
Munugode By polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతం 11.2గా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నారాయణపురం మండలంలోని
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతం 11.2గా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నారాయణపురం మండలంలోని అల్లందేవి చెరువు గ్రామంలో బూత్ నెంబర్ 82లో ఈవీఎం మొరాయించగా.. దాదాపు అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. చండూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఓ ఇంట్లో స్థానికేతరులను ఉన్నారంటూ.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగ్గా.. స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
మరో వైపు నారాయణపురం పరిధిలోని లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు వేశారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు. రెండుచోట్ల ఈవీఎంలో సమస్యలు తలెత్తితే సరిచేశామన్నారు. నిన్న రాత్రి పలుగ్రామాల్లో తనిఖీలు జరిగాయని, స్థానికేతరులు లేకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

