హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖలోని పోలీసు, ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టీఎస్పీఎఫ్, అగ్నిమాపక విభాగాల్లో మొత్తం 692 పోలీసు సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. పోలీసుశాఖలో 9మందికి, అగ్నిమాపకశాఖలో ఇద్దరి కలిపి మొత్తం 11మందిని శౌర్య పతకాలకు ఎంపిక చేసింది. మరో 19మందికి మహోన్నత సేవా పతకాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. శౌర్యపతకం పొందిన 11మందికి ప్రతీనెలా వారి వేతనంలో రూ.500 ఇంక్రిమెంట్ కలువనున్నది. శౌర్యపతకం పొందిన వారిలో గ్రేహౌండ్స్ నుంచే 9మంది ఉన్నారు. మొత్తం పోలీసుశాఖకు 625, ఏసీబీకి 22, విజిలెన్స్‌కు 6, అగ్నిమాపకశాఖకు 20, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ (టీఎస్పీఎఫ్) 29 పతకాలు వచ్చాయి.
శౌర్యపతకం పొందిన వారిలో..