బంజారాహిల్స్,డిసెంబర్ 25: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు 20రోజుల క్రితం ఆయన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన గొడవ వ్యవహారంలో నమోదైన కేసులో ఈనెల 27న విచారణకు రావాలంటూ మాసాబ్ ట్యాంక్ పోలీసులు 41(ఏ)నోటీసులు ఇచ్చారు. సంఘటనలో పాల్గొన్నవారి వివరాలు తీసుకోవడంతో పాటు ఇతర ఆధారాలు సేకరించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఘటనలో మరికొంతమందిని నిందితులుగా చేర్చాలని పోలీసు ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు వచ్చినట్లు స మాచారం. కౌశిక్‌రెడ్డి వెంటవచ్చి న వారి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది.