జనగామ, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు న్యాయవాదులపై జనగామ స్టేషన్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని జనగామ బార్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం కోర్టు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఓ కేసు విషయంలో సోమవారం సాయంత్రం జనగామ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాదులు గద్దల అమృతరావు, కవితపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేశారని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు రాత్రి 9 గంటలకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అయితే, న్యాయవాదులే పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించారని సీఐ రఘుపతిరెడ్డి చెప్పారు.