పోలీసుల డేటా హ్యాకర్ అరెస్టు
ఇటీవల పోలీసు డేటా వ్యవస్థలపై దాడి చేసి, కొంత డేటాను లీక్ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్టు డీజీపీ రవిగుప్తా ఆదివారం వెల్లడించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాకు చెందిన 20 ఏండ్ల విద్యార్థి జతిన్‌కుమార్ అని తెలిపారు.
- ఆధార్ డేటా చోరీ కేసులోనూ నిందితుడు
- ఢిల్లీలో అరెస్టుచేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో
- నిందితునికి సహకరించిన వారి కోసం గాలింపు
- టీఎస్‌కాప్ డేటా లీక్ కాలేదు.. భద్రంగానే ఉంది
- భవిష్యత్తులో పటిష్ఠ చర్యలు : డీజీపీ రవిగుప్తా
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఇటీవల పోలీసు డేటా వ్యవస్థలపై దాడి చేసి, కొంత డేటాను లీక్ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్టు డీజీపీ రవిగుప్తా ఆదివారం వెల్లడించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాకు చెందిన 20 ఏండ్ల విద్యార్థి జతిన్‌కుమార్ అని తెలిపారు. తెలంగాణ పోలీసు వ్యవస్థలో కీలకమైన హాక్ ఐ, టీఎస్‌కాప్, ఎస్ఎంఎస్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడి కొంత సమాచారాన్ని తోటి హ్యాకర్లతో కలిసి జతిన్‌కుమార్ దొంగిలించినట్టుగా చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డేటా లీక్ ఆధారాలతో ఢిల్లీకి వెళ్లి మరీ శనివారం నిందితుడు జతిన్‌కుమార్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు.
తెలంగాణ పోలీసు వ్యవస్థకు చెందిన కొంత డేటాను పబ్లిక్ ప్లాట్ఫామ్లో పోస్టు చేసింది జతిన్‌కుమార్ అని నిర్ధారించుకున్న తర్వాతే అతన్ని అరెస్టు చేశామని తెలిపారు. డేటా చోరీకి సంబంధించిన వివరాలను databreachforum.stలో పోస్ట్ చేశాడని, చోరీ డేటాను 150 డాలర్లకు అమ్మకానికి పెట్టాడని చెప్పారు. ఆసక్తి గల కొనుగోలుదారులు వరుసగా హాక్ ఐ, టీఎస్‌కాప్ డేటాకు సంబంధించి తనను సంప్రదించాలంటూ టెలిగ్రామ్‌లో Adm1nfr1end, Adm1nfr1ends అనే ఐడీలు క్రియేట్ చేసి పోస్టు చేసినట్టు గుర్తించామని తెలిపారు.
తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి, తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న నిందితుడు తన గుర్తింపును దాచిపెట్టే ప్రయత్నం చేశాడని, అయినా సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను ఉపయోగించి ఢిల్లీలో అరెస్టు చేశామని తెలిపారు. అతన్ని ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకురానున్నట్టు డీజీపీ చెప్పారు. నిందితుడు జతిన్‌కుమార్‌కు గతంలోనూ పలు డేటా చోరీలకు పాల్పడిన చరిత్ర ఉన్నదని తెలిపారు. నిరుడు సంచలనం సృష్టించిన ఆధార్ డేటా లీక్ కేసులో జతిన్‌కుమార్ కీలక హ్యాకర్‌గా వ్యవహరించాడని, దీంతోపాటు వివిధ ఏజెన్సీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని హ్యాక్ చేయడంలోనూ కీలకంగా వ్యవహరించాడని తెలిపారు. జతిన్‌కుమార్‌కు సహకారం అందించిన తోటి హ్యాకర్లను కూడా అరెస్టు చేస్తామని డీజీజీ స్పష్టం చేశారు.
డేటా లీక్ కాలేదు.. భద్రంగానే ఉంది
జతిన్‌కుమార్ దొంగిలించిన తెలంగాణ పోలీసు వ్యవస్థల డేటా భద్రంగానే ఉన్నదని డీజీపీ రవిగుప్తా తెలిపారు. బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా ‘హాక్ ఐ’లోని కొన్ని విభాగాలకు చెందిన డేటాను మాత్రమే యాక్సెస్ చేసి ఉండొచ్చని డీజీపీ వివరణ ఇచ్చారు. ‘టీఎస్‌కాప్’ యాప్‌లోని సమాచారం సేఫ్‌గా ఉన్నదని, థర్డ్ పార్టీకి డేటాను అమ్మారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఎస్ఎంఎస్ సర్వర్లోకి సైబర్ నేరగాళ్లు చొరబడ్డట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తమని పేర్కొన్నారు. హ్యాకింగ్‌పై భద్రతాపరమైన లోపాలు ఉన్నాయోమోనని పరీక్షిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి హ్యాక్‌ల నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయెల్ పర్యవేక్షణలో తక్కువ సమయంలో నిందితున్ని అరెస్టు చేసిన ఎస్పీలు భాసరన్, విశ్వజిత్ కంపాటి, డీఎస్పీలు కేవీఎం ప్రసాద్, ఏ సంపత్, ఇన్స్పెక్టర్ ఆశిశ్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేశ్‌ను డీజీపీ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

