హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం ప్రతిఏటా స్కాలర్షిప్ కోసం నిర్వహించే పీఎం యశస్వి పరీక్షను ఈసారి రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. శుక్రవారం పరీక్ష నిర్వహిస్తామని తొలుత ప్రకటించగా.. చివరి నిమిషంలో పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది మెరిట్ ఆధారంగానే స్కాలర్షిప్నకు ఎంపిక చేస్తామని పేర్కొన్నది.