హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రీల్ 21(నమస్తే తెలంగాణ): మీకు వ్యభిచారులు కావాలా? సెక్స్‌లో పాల్గొంటారా? సురక్షితమైన అడ్డా కావాలా? అయితే ఓటీపీ చెప్తేనే మీకు అక్కడ ప్రవేశం! లేదంటే నో ఎంట్రీ! ఇది హైదరాబాద్‌లో నైజీరియా ముఠా సాగిస్తున్న కొత్త దందా. ఓకే క్యూపిడ్ అనే డేటింగ్ యాప్ ద్వారా జరుగుతున్న ఈ తంతును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు.
ఈ యాప్‌లో వేలాది సభ్యులు రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. తొలుత యాప్‌లో నైజీరియా నేరగాళ్లు చాటింగ్ చేస్తూ స్నేహితులుగా మారతారు. ఆ తర్వాత వ్యక్తిగత ఫోన్ నెంబర్ల ద్వారా వాట్సాప్‌లో చాటింగ్ చేస్తారు. సెక్స్ వైపు మనస్సు మళ్లిస్తారు. పరాయివారితో సెక్స్‌లో పాల్గొనేందుకు అనువైన, సురక్షితమైన అడ్డాను చూపిస్తామని నమ్మిస్తారు. వాట్సాప్ ద్వారా తాము పంపిన ఓటీపీ చెప్తేనే అక్కడ లోపలికి అనుమతిస్తారని స్పష్టంచేస్తారు. ఒప్పందం కుదిరితే.. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేసుకొని, వాట్సాప్‌లో ఓటీపీ పంపిస్తారు. ఈ వ్యవహారంపై పోలీసు బృందం డీకాయ్ అపరేషన్ నిర్వహించింది.