దరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు(పీఈటీ) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎస్సీ గురుకుల డిగ్రీ, జూనియర్ కాలేజీల పీడీ, పీఈటీల సంఘం డిమాండ్ చేసింది. ఫిజికల్ డైరెక్టర్ల ప్రమోషన్ సమస్యలను రాబోయే 3వ బోర్డ్ ఆఫ్ గవర్నర్న్ సమావేశంలో చర్చించి పరిషరించాలని కోరింది. ఈ మేరకు సంఘం చైర్మన్ రామలక్ష్మణ్, అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి చందర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీడీలు, పీఈటీలు క్రీడాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట తీసుకొస్తున్నట్టు గుర్తుచేశారు. అవసరమైన అర్హతలు, అనుభవమున్నా ప్రిన్సిపాల్ ఉద్యోగోన్నతుల్లో ప్రాధాన్యమివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ ఉన్న పీడీ గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.