హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎప్‌సెట్ బైపీసీ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎట్టకేలకు నాలుగు నెలలు ఆలస్యంగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఫార్మసీ కౌన్సిల్ అనుమతులివ్వడంలో తీవ్ర జాప్యం చేయడంతో కౌన్సెలింగ్ ఆలస్యమైంది. మొత్తం రెండు విడతల్లో సీట్లు భర్తీచేస్తారు. మొదటి విడత షెడ్యూల్లో భాగంగా ఈ నెల 19 నుంచి 22లోపు ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్, 21 నుంచి 23లోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 21 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 28న సీట్ల కేటాయింపు, 28 నుంచి 30 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తుది విడత షెడ్యూల్లో భాగంగా నవంబర్ 4న ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోవాలి. 5న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 5, 6న వెబ్ ఆప్షన్ల నమోదు, 9న సీట్ల కేటాయింపు ఉంటుంది. 9 నుంచి 11లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపు, 11, 12న రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 12న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు.
పెండింగ్ డీఏలు విడుదల చేయాలి: యూటీఎఫ్
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బాకీపడ్డ పెండింగ్ డీఏలు, బిల్లులను తక్షణమే చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధులు జంగయ్య, చావరవి, లక్ష్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. కాగా, జీవో-317 బాధితుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి కోరారు.