హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): పెంపుడు జంతువులను గాలికొదిలేయద్దని, అలా నిర్లక్ష్యం చేసిన జంతువులు క్రూరంగా మారే అవకాశం ఉన్నదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ) పరిశోధకులు హెచ్చరించారు. సహజ ఆవరణాల్లోకి చొచ్చుకుపోయే జంతువులు క్రూరంగా మారి, అక్కడి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తాయని వెల్లడించారు.
ప్రస్తుతం జలచరాల్లో ప్రమాదకారిగా చెప్పుకొనే క్యాట్ ఫిష్ ఇదే తరహాలో సహజ ఆవరణంలోకి వచ్చాయని వివరించారు. జీవావరణం, అంతరించిపోతున్న జంతుజాలం వంటి అంశాలపై సీసీఎంబీ లా కోన్స్ విద్యార్థులు అధ్యయనం చేశారు. పెంపుడు జంతువులు ఎలా క్రూరంగా మారాయో వివరించారు. ‘ఆఫ్రికాలో క్యాట్‌ఫిష్‌ను ఆక్వేరియంలో పెట్టి పెంచుకొనేవారు. జల వనరుల్లో విడిచిపెట్టడంతో రాకాసి చేపలుగా మారా యి. ఆహారాన్ని వెతికే క్రమంలో చిన్న చేపలపై దాడి చేయడం మొదలు పెట్టాయి. అలా సహజ వనరులను ధ్వంసం చేసే స్థాయికి వృద్ధిచెందాయి’ అని తెలిపారు.