హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్ 202324) షెడ్యూల్ ఖరారైంది. గురువారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ ఆర్ లింబాద్రి పీఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. బీపీఈడీ, యూజీ- డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేస్తామని లింబాద్రి ప్రకటించారు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500, బీసీ, జనరల్ విద్యార్థులు రూ.900 చెల్లించాలని పేర్కొన్నారు.
దరఖాస్తు, ఇతర వివరాలకు https:// pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్‌రావు, శాతవాహన వర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ మల్లేశ్, మహాత్మాగాంధీ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ గోపాల్‌రెడ్డి, పాలమూరు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ లక్ష్మీకాంత్ రాథోడ్, పీఈసెట్ కన్వీనర్ రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.