హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సులోని సీట్ల భర్తీకి నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 3న అర్హులైన వారి జాబితాను ప్రదర్శిస్తారు. 4, 5న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 6న ఆప్షన్లు సవరించుకోవచ్చు. 8న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు 9 నుంచి 12 వరకు రిపోర్ట్‌చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): భాషాపండితుల అప్‌గ్రేడేషన్‌తో మిగిలిపోయిన 800 పోస్టులను సైతం అప్‌గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని ఆర్‌యూపీపీ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీ జగదీశ్ ప్రభుత్వాన్ని కోరారు. 10వేల మంది అప్‌గ్రేడ్ కాగా, కేవలం 800 మంది మాతమ్రే మిగిలారని, వారికి సైతం న్యాయం చేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి రమేశ్, నాయకులతో కలిసి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను శక్రవారం సచివాలయంలో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.