రెండేండ్ల బీఈడీ కోర్సులో మరో 6,928 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడత వెబ్ కౌన్సెలింగ్లో ఆయా సీట్లు నిండాయి. కౌన్సెలింగ్కు 11,087 మంది హాజరుకాగా, 9,616 సీట్లకు 6,928 సీట్లు నిండాయి.
బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సులోని సీట్ల భర్తీకి నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.