హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఈడీ కోర్సులో మరో 6,928 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో ఆయా సీట్లు నిండాయి. కౌన్సెలింగ్‌కు 11,087 మంది హాజరుకాగా, 9,616 సీట్లకు 6,928 సీట్లు నిండాయి. వీటిని దక్కించుకున్న వారు 30లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు సూచించారు.
ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించండి’
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని టీచర్లకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, సరోత్తంరెడ్డి కోరారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఈ అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తిచేయగా, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖరాస్తానని సీఈవో హామీనిచ్చినట్టు వారు తెలిపారు.
30 నుంచి ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఐసెట్‌లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 30 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. 30న ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అక్టోబర్ 1న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 1,2న వెబ్ ఆప్షన్ల నమోదు, 4న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. సీట్లు పొందిన వారు 4, 5న ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్‌చేయాలని, 5 నుంచి 7 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 6న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు.