శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 17, 2021 , 13:21:17

ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్‌ రెడ్డి

ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్‌ రెడ్డి

వనపర్తి: హరితహారం, పల్లెప్రగతి వంటి సామూహిక పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సామూహిక కార్యక్రమాలు విజయవంతమైతే గొప్ప సమాజం నిర్మాణమవుతుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. వనపర్తి మండలం పెద్దగూడెంలో మంత్రి పల్లెనిద్ర చేశారు. ఆదివారం ఉదయం ఆయన గ్రామంలో కలియతిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు స్వయం సంమృద్ధి సాధించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పల్లెల్లో సాగునీటి వసతులు మెరుగవడంతో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు.


ప్రజా సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టానని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి సమష్టిగా పనిచేస్తే సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుందని చెప్పారు. సమస్యల మూలాలు తెలిస్తేనే వాటి పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పల్లెనిద్రలను ప్రారంభించానని, మంత్రిగా దానిని కొనసాగిస్తున్నాని వెల్లడించారు.  

VIDEOS

logo