భూత్పూర్, ఫిబ్రవరి 22 : వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆసరా పింఛన్ డబ్బులను ఇంటి ట్యాక్స్ కింద పంచాయతీ కార్యదర్శి వసూలు చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గరలో చోటుచేసుకున్నది. శనివారం కొత్తమొల్గరలో పింఛన్ డబ్బులు పంపిణీ చేయగా, చిల్లా వెంకటేశ్వరమ్మ పింఛన్ తీసుకున్నది. పంచాయతీ కార్యదర్శి మొగిలిరెడ్డి ఇంటి ట్యాక్స్ కింద రూ.950 చెల్లించాలని చెప్పాడు. దీంతో చేసేది లేక వెంకటేశ్వర్‌రెడ్డి వచ్చిన పింఛన్ డబ్బులను పంచాయతీ కార్యదర్శికి చెల్లించి వెళ్లిపోయింది.