జనగామ జిల్లా కేంద్రం పరిధిలోని వడ్లకొండ, పెద్దపహాడ్, పసరమడ్ల శివారులోని చంపక్ హిల్స్ ప్రాంతంలో నెమళ్లు సందడి చేస్తున్న దృశ్యాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. గతంలో ప్రభు త్వం విత్తన బంతులు విసరడంతో మొక్కలు చెట్లుగా ఎదిగాయి.
దాంతో ఈ ప్రాంతం జంతువులు, పక్షులకు నివాస యోగ్యంగా మారింది. శుక్రవారం పెద్దపహాడ్ శివారులోని పచ్చటి బయళ్లలో కనువిందు చేస్తున్న ఓ నెమలి కంటపడడంతో ‘నమస్తే’ క్లిక్‌మనిపించింది.
– నమస్తే ఫొటోగ్రాఫర్/జనగామ రూరల్