Revanth Reddy | రైతు భరోసా వెనుక ఇంత మోసం ఉందా.. కాంగ్రెస్ గుట్టు బయటపెట్టిన రేవంత్ రెడ్డి
Revanth Reddy | అబద్ధాన్ని ఎల్లకాలం దాచలేరు. అందర్నీ అన్నిసార్లూ మోసం చేయలేరు. తెలంగాణ రైతులకు భరోసా అంటూ కాంగ్రెస్ చేసిన ‘గ్యారెంటీ’ మోసం గుట్టు పీసీసీ చీఫ్ రేవంత్ నోటే బట్టబయలయింది.
Revanth Reddy | అబద్ధాన్ని ఎల్లకాలం దాచలేరు. అందర్నీ అన్నిసార్లూ మోసం చేయలేరు. తెలంగాణ రైతులకు భరోసా అంటూ కాంగ్రెస్ చేసిన ‘గ్యారెంటీ’ మోసం గుట్టు పీసీసీ చీఫ్ రేవంత్ నోటే బట్టబయలయింది. మాజీ ఎమ్మెల్సీ, పాత్రికేయుడు ప్రొ.నాగేశ్వర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రైతు భరోసా మోసాన్ని తనంతట తానే బయటపెట్టారు. తనకే అర్థం కాని రీతిలో ఏదేదో మాట్లాడి నవ్వులపాలయ్యారు!
బీఆర్ఎస్తో 30 వేలు!
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధుతో రైతుకు ఎకరానికి ఏడాదికి ప్రస్తుతానికి 10 వేలు, మున్ముందు 16 వేలు పెట్టుబడి సాయం అందుతుంది. రైతు ఒకవేళ తనభూమిని కౌలుకు ఇస్తే అదనంగా ఎంతోకొంత (దాదాపు 15వేలు) కౌలుమొత్తం వస్తుంది. ఈ లెక్కన రైతుకు ఎకరానికి 30వేలు లభిస్తుంది.
కాంగ్రెస్‌తో 15 వేలు!
రేవంత్ చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ రైతుభరోసాతో రైతుకు అయితే పెట్టుబడి సాయం, లేదంటే కౌలు .. ఏదో ఒకటే లభిస్తుంది. అంటే రైతు ఒకదాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.
నాగేశ్వర్: రైతుభరోసా మీద ఇంపార్టెంట్ కామెంట్ ఒకటి వినిపిస్తున్నది. కౌలుదార్లకు ఇవ్వడం అంటూ మొదలుపెడితే భూయజమానులకు భయం మొదలవుతది. కౌలుదార్లకు చట్టాలున్నయ్. కౌలుకు ఇస్తే భూమి ఎక్కడ పోతుందోనని రేపు యజమానులకు భయం రాదా?
రేవంత్: మేం విస్పష్టంగా చెప్పినం. భూ యజమానికి ఇస్తం. గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి.. కౌలుదార్లు ఎవరు? ఏ భూమి కౌలుకు తీసుకున్నరు? వారి ఒప్పంద పత్రాలను చూసి గ్రామసభల్లో ఆమోదించిన తర్వాత తెలిసిపోతది.
నాగేశ్వర్: కౌలుకు ఒప్పంద పత్రాలుండవు కదా?
రేవంత్: లేదు. వాళ్లు ఏదైతే కౌలుకు మాట్లాడుకుంటరో అదే ఒప్పందం. 2011లో కాంగ్రెస్ పార్టీ కౌలుదార్ల చట్టమే తెచ్చింది. దానిప్రకారం కౌలుదార్లను గుర్తిస్తం. యజమానికి రావాల్సింది యజమాని ఖాతాలో పడుతది. కౌలురైతుకు రావాల్సింది కౌలుదారుకు వస్తది. భూమిలేని వాళ్లు ఉపాధి కూలీకి పోయేవారికి కూడా మేం మద్దతు ఇచ్చేలా ఇందులో పెట్టినం.
నాగేశ్వర్: సో.. ఈ లెక్కన అందరికీ ఇస్తరు?
రేవంత్: ఆల్మోస్ట్ అందరికీ ఇస్తం.
నాగేశ్వర్ : అప్పుడు డబుల్ డబుల్ పడుతది కదా?
రేవంత్: లేదు. ఓవర్లాప్ కాదు. వాళ్లకు వస్తే వీళ్లకు రాదు. వీళ్లకు వస్తే వాళ్లకు రాదు. ఎక్కడోదగ్గర అడ్జస్ట్ అవుతుంది కాబట్టి, హార్ట్‌బర్న్ ఉండదు. ఒకవేళ కౌలురైతులకు రాకపోతే, ఉపాధిహామీ కూలీల కింద వాళ్లకు ఆటోమేటిక్‌గా ఇస్తం. రైతు ఒప్పుకోకపోతే రైతుకు నష్టంచేయాల్సిన అవసరమే లేదు. ఇయ్యాల భూమి లేనివాళ్లకు కూడా 12వేల రూపాయలు ఆల్రెడీ ప్రకటించినం కదా. ఓవర్లాప్ లేకుండా కంప్యూటరైజ్ చేస్తాం కాబట్టి సమస్యనేలేదు. వాళ్లకు వస్తే వీళ్లకు రాదు. వీళ్లకు వస్తే వాళ్లకు రాదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

