హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన పవన్, ఎన్నికల ప్రచార రథం వారాహికి కొం డపై పూజలు చేయాలని భావించారు. కొండపైకి వారాహి వాహనానికి అనుమతి లేదని అక్కడి అధికారులు తెలుపగా, ఘాట్ రోడ్ టోల్ గేట్ దగ్గర అమ్మవారి విగ్రహం ఎదుట వాహనానికి పూజలు చేశారు.