హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): స్పెషల్ డ్రైవ్లో భాగంగా వచ్చే నెల 3న పాస్పోర్ట్ సిబ్బంది సేవలందించనున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్పీవో పరధిలోని 14 పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో సాధారణ క్యాటగిరీ కింద 700 అపాయింట్మెంట్లు జారీ చేస్తామని తెలిపారు. సమాచారం కోసం www.passport india. gov.in/ mpassportseva యాప్లో సంప్రదించాలని, అపాయింట్మెంట్స్ రీషెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపారు.