హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ) : సాంకేతిక సమస్యల కారణంగా పాస్‌పోర్టు సేవల్లో అంతరాయం కలిగిందని, సెప్టెంబర్ 2న ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా సేవలు అందుబాటులోకి వస్తాయని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు అధికారి స్నేహజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం నమోదైన స్లాట్స్‌ను మరో తేదీకి మారుస్తామని, అందుకు సంబంధించిన సందేశాలు దరఖాస్తుదారులకు చేరవేసినట్టు పేర్కొన్నారు. స్లాట్స్‌కు సంబంధించి సందేహాలుంటే rpo.hyderabad@mea.gov.inకు మెయిల్ చేయవచ్చని సూచించారు.