హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి, ఆమోదించిన యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లును వెంటనే పాస్ చేయాలని గవర్నర్ తమిళసైకి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభా వేదికగా విజ్ఞప్తి చేశారు.
శనివారం కొనసాగిన సమావేశంలో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లు ఆమోదానికి కృషి చేయాలని మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు సభ్యులు కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, ఇప్పటికే బిల్లును ఆమోదించాలని గవర్నర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం శాసనసభా వేదికగా మరోసారి గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.