NREGS | హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) లక్ష్యానికి కేంద్ర సర్కారు గండికొడుతున్నది. కూలీలకు పని కల్పించడం, నిరుపేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన ఉపాధి లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది. ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకొస్తున్నది. ఫలితంగా ప్రతిఏటా లక్షల సంఖ్యలో నిరుపేద కూలీలు ఉపాధి పనులకు దూరమవుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పూర్తిచేసిన తెలంగాణకు హరితహారం, క్రీడా ప్రాంగణాలు, కల్లాలు, వైకుంఠధామాలకు సంబంధించి నిధులను కేంద్రం నిలిపివేసింది. ప్రతి సంవత్సరం జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించడమే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లక్ష్యం.
కానీ, వివిధ నిబంధనలతో కొత్త పనులు పెరుగకపోవడంతో ఏటేటా కూలి తగ్గుతున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌తో లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు ఉదయం, సాయంత్రం పనులకు తప్పనిసరిగా హాజరుకావాలని షరతులు విధించింది. కూలీల పనులకు సంబంధించి ఉదయం 11 గంటల్లోపు ఒక ఫొటో, మధ్యాహ్నం 2 గంటల తర్వాత రెండో ఫొటో తప్పనిసరిగా తీయడంతోపాటు అప్లోడ్ చేస్తున్నారు. ఒక గ్రామంలో ఉపాధి పని పూర్తయిన తర్వాతే మరో పని చేపట్టాలనే నిబంధన విధించారు. తద్వారా పనులు ఆలస్యమవుతున్నాయి. మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్లోనూ కేంద్రం కోత విధించడం గమనార్హం.
తెలంగాణలో ఉపాధి కూలీల వివరాలు
దేశవ్యాప్తంగా వివరాలు
గడిచిన ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కూలీలకు చెల్లించిన మొత్తాలు
గడిచిన ఆరేండ్లలో కేంద్ర సర్కారు ఉపాధి కూలీలకు చెల్లించిన మొత్తాలు