న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మంచి పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు ‘దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’, ‘నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’ పేరుతో పురస్కారాలను అందజేసింది. ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. దేశంలో మొత్తం 46 గ్రామ పంచాయతీలకు అవార్డులు దక్కగా.. అందులో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే 13 పురస్కారాలు రావడం విశేషం. కాగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన 13 పంచాయతీ పురస్కారాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
1. గౌతంపూర్: ఆరోగ్య పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్‌కు అవార్డు దక్కింది.
2. నెల్లుట్ల: సమృద్ధిగా మంచి నీరు అందుబాటులో ఉన్న పంచాయతీల విభాగంలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్లకు పురస్కారం వచ్చింది.
3. కొంగట్ పల్లి: సామాజిక భద్రతగల గ్రామాల విభాగంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్ పల్లి అవార్డు అందుకుంది.
4. అయి పూర్: స్నేహపూర్వక మహిళా గ్రామాల విభాగంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం అయిపూర్కు పంచాయతీ పురస్కారం దక్కింది.
5. మందొండి: పేదరిక నిర్మూలన, జీవనోపాదులు పెంచిన గ్రామాల విభాగంలో గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం
అవార్డు అందుకుంది.
6. చీమల్ దారి: సుపరిపాలన గ్రామ పంచాయతీల విభాగంలో వికారాబాద్ జిల్లా మొయిన్ పేట మండలం చీమల్ దారి గ్రామానికి పంచాయతీ పురస్కారం వచ్చింది.
7. సుల్తాన్ పూర్: క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్ పూర్
గ్రామం పంచాయతీ పురస్కారం తీసుకుంది.
8. గంభీరావుపేట: స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాల విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం గంభీరావు పేట గ్రామానికి అవార్డు వచ్చింది.

Panchayati Awards 2
1. ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీల అవార్డు విభాగంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్ఎండీ.
2. ఉత్తమ జిల్లా పరిషత్ విభాగంలో ములుగు జిల్లా
3. స్పెషల్ కేటగిరీ అవార్డుల్లో గ్రామ ఊర్జా స్వరాజ్ విశేశ్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామం
4. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్ విభాగంలో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం
5. నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ సర్టిఫికెట్ల విభాగంలో గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ కు సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి