కల్హేర్, డిసెంబర్ 6: చేపల దుకాణం ఏర్పాటు కోసం ఎన్వోసీ ఇవ్వడానికి పంచాయతీ కార్యదర్శి రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది. కల్హే ర్ మండలం మాసాన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి మహాదేవుపల్లి శివారులోని చౌరస్తాలో చేపల దుకాణం పెట్టుకునేందుకు బ్యాంక్ లోన్ అవసరం పడింది. ఎన్వో సీ ఇచ్చేందుకు మహాదేవ్పల్లి పంచాయ తీ కార్యదర్శి సీ ఉమేశ్ రూ.15 వేల లం చం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మెదక్ రేంజ్ ఏ సీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి వలపన్ని శుక్రవారం కోహీర్ మండల ప్రజా పరిషత్ వెనుక బాధితుడు కార్యదర్శికి నోట్లు ఇస్తున్న క్రమంలో పట్టుకున్నారు. కార్యదర్శిపై కేసు నమో దు చేసి, నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.
ప్రశ్నించే గొంతులను అరెస్టులతో ఆపలేరు ; నరసింహారెడ్డి ఆగ్రహం
మఠంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్రజాసమస్యలపై ప్రశ్నిం చే గొంతులను అక్రమ అరెస్టులతో ఆపలేరని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి తెలిపారు. మఠంపల్లి మండలం భీమ్లాతండాలో జరిగిన బానోతు పాచ్యనాయక్ హత్యను కాం గ్రెస్ చేసిన హత్యగానే పరిగణిస్తున్నామని స్పష్టంచేశారు. హంతకులను వెం టనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశా రు. ఓ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన మన్నెం శ్రీనివాస్‌రెడ్డిని న ర్సింహారెడ్డి పరామర్శించారు.