చండూరు, సెప్టెంబర్ 20: తెలంగాణ ఉద్యమ నాయకుడు, దివంగత మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సతీమణి సృజనమణి అనారోగ్యంతో బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. చండూరు మండలంలోని ఇడికుడ స్వగ్రామంలో గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. కార్యకర్తల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని బంజారాహిల్స్‌లోని వారి స్వగృహంలో ఉంచనున్నారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 2017లో మృతిచెందారు. ప్రస్తుతం ఆయన వారసురాలిగా కుమార్తె స్రవంతి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు.