బుద్ధవనంలో పాతరాతి యుగం ఆనవాళ్లు
నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం థీమ్ పార్కులో పాత రాతి యుగం ఆనవాళ్లు కనిపించినట్టు పురావస్తు నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. సోమవారం బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య,
నందికొండ, మార్చి 20 : నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం థీమ్ పార్కులో పాత రాతి యుగం ఆనవాళ్లు కనిపించినట్టు పురావస్తు నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. సోమవారం బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బౌద్ధ భిక్షువు అరుణోతో కలిసి బుద్ధవనంలో కృష్ణానది తీరం వెంట సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం సర్వే చేస్తుండగా, పాతరాతియుగపు బింగిరాయిని గుర్తించినట్టు చెప్పారు. ఈ రాయిని ఆదిమ మానవులు పనిముట్టుగా వాడినట్టు తెలిపారు. క్రీస్తు పూర్వం 2.6 నుంచి 1.6 మిలియన్ సంవత్సరాల్లో ఇలాంటి పనిముట్లను ఆదిమానవులు వాడారని, ఆ దశను అచూలియన్గా పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొంటారని తెలిపారు. ఆయన వెంట బుద్ధవనం ఓఎస్డీ సుధాన్రెడ్డి, సహాయ శిల్పి శ్యాంసుందర్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Buddhavanam
- Palaeolithic
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

