ఆహారంపై బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకొనే పీ995 సాంకేతికత
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): అన్నం ఒక రోజుకు మించి నిల్వ ఉంచలేం. ఈ సమస్యకు చెక్ పెట్టేలా పీ995 టెక్నాలజీని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) పరిశీలించింది. ఈ సాంకేతికత బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించి, ఆహారం పాడవకుండా అడ్డుకుంటుంది.
ఓజోనేటర్, యూవీ లైట్ కంటే మెరుగ్గా పనిచేసే ఈ టెక్నాలజీతో కలిగే ప్రయోజనాలపై ఎన్ఐఎన్ చేసిన అధ్యయనం చేయగా, ఆహారంపై బ్యాక్టీరియా వృద్ధి గణనీయంగా తగ్గినట్టు వెల్లడైంది. ఈ టెక్నాలజీ కలుషిత ఆహారానికి చెక్ పెడుతుందని ఫుడ్ ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్‌కు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని వెల్లడిస్తున్నారు.