 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): అర్హులకే విదేశీ విద్యానిధి పథకాన్ని వర్తింపజేస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్ వెల్లడించారు. గురువారం సంక్షేమశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. సుమారు 2,288 మందికి సంబంధించిన ఓవర్సీస్ సాలర్షిప్ బకాయిలు రూ.304 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలివ్వడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు.
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు ఏ సమస్య ఉన్న తక్షణ పరిషారం కోసం నిరంతరం పని చేస్తున్నామని మంత్రి చెప్పారు. సమీక్షలో సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, ఎస్సీడీడీ ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధ ప్రకాశ్, కమిషనర్ క్షితిజ తదితరులు పాల్గొన్నారు.
 
                            