మా ఊరి గుడి, బడిని అభివృద్ధి చేస్త్తా
- హెటిరోడ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి
వేంసూరు, ఫిబ్రవరి 21 : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పాఠశాలతోపాటు ఆలయ అభివృద్ధికి కూడా తనవంతుగా సహకారం అందిస్తానని హెటిరో డ్రగ్స్ అధినేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు, పూర్వ విద్యార్థి బండి పార్థసారథిరెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని కందుకూరుకు వచ్చారు. తొలుత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 500 ఏండ్ల క్రితం గ్రామంలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. వచ్చే నెల 14 నుంచి 19 వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల కంటే ముందే ఆలయానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కందుకూరు ఉన్నత పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చానని, సీఎం కేసీఆర్ స్ఫూర్తితో తన తల్లి బండి సోమ కాంతమ్మ పేరిట పాఠశాలను అన్ని హంగులతో తీర్చిదిద్దుతానని ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

