Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్‌టైం చాన్స్ బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల 2000-2019 మధ్య బ్యాచ్‌ల విద్యార్థులకు వన్‌టైం చాన్స్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఫలితాలు సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులు తమ మార్కు మెమోలను ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచిలోని పీజీ సెక్షన్ (రూం నెంబర్.13) నుంచి తీసుకోవచ్చని సూచించారు.