Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీఈడీ (ఇయర్ వైజ్), బీఈడీ (సెమిస్టర్ వైజ్), ఎంఈడీ (సెమిస్టర్ వైజ్) వన్ టైం చాన్స్ పరీక్షలను వచ్చే నెల ఆరవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ లో చూసుకోవాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ వన్ టైం ఛాన్స్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఈ (నాన్ సీబీసీఎస్) కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.