OU Exams | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన అన్ని కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ ఈవినింగ్, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, కోర్సుల మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్, డిగ్రీ కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ వన్‌టైం చాన్స్, దూరవిద్య ద్వారా అందించే సర్టిఫికెట్ కోర్స్ ఇన్ యోగా తదితర కోర్సుల పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను నిర్ణయించామన్నారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.