Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్ – ఈవినింగ్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ రెగ్యులర్ పరీక్ష ఫలితాలతో పాటు డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.