ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 6: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల నాలుగో తేదీన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరిగిన నేపథ్యంలో ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆ పరీక్షను తిరిగి నిర్వహించే తేదీలను ఖరారు చేశామని, పరీక్షా తేదీ, సమయంలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఆ పరీక్షను తిరిగి నిర్వహించే తేదీలను ఓయూ వెబ్సైట్ www. osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
వివిధ కోర్సుల పరీక్షా తేదీలు ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేశారు. ఎంఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 21 నుంచి, బీపీఈడీ, డీపీఈడీ మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్ పరీక్షలను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని అన్నారు.