హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం అమలుకోసం ఖాతాలు తెరవాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. బ్యాంకు ఖాతాను పథ కం కోసమే వినియోగించాలని సూచించింది. బ్యాంకు లావాదేవీల నిర్వహణ బాధ్యతలను సెర్ప్ అధికారులకు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. పథకం పారదర్శకంగా అమలయ్యేందుకు బ్యాంకు ఖాతాలను ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలని తెలిపింది. సూచించిన కమర్షియల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోనే అకౌంట్ తీయాలని స్పష్టంచేసింది.