హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : హాజరు మినహాయింపు తో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజర య్యే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు కల్పించింది. మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, హ్యుమానిటీ స్ గ్రూపుల్లో పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి వారు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హాజరు మినహాయింపు కోసం నవంబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 200 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఫీజు చెల్లించిన వారు కాలేజీలకు వెళ్లకుండా, క్లాసులకు హాజరుకాకుండానే పరీక్షలు రాసుకోవచ్చు.