హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్‌గా డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డిని ప్రభుత్వం నియమించింది. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హరీశ్ చంద్రారెడ్డి ప్రస్తు తం మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎంజీఎం దవాఖానలో వరుస ఘటనల నేపథ్యంలో సూపరింటెండెంట్ కిశోర్‌కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది.