హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీటెక్ మేనేజ్మెంట్, ఎన్నారై కోటా సీట్ల భర్తీలో జరుగుతున్న అక్రమాలకు వచ్చే ఏడాదైనా అడ్డుకట్టపడుతుందా..? అంటే తెలంగాణ ఉన్నత విద్యామండలి వర్గా లు అవుననే అంటున్నాయి. దీనిపై తాము దృష్టిసారించామని, బీ క్యాటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీచేసేందుకు ప్రయత్నిస్తున్నామని మండలి వర్గాలంటున్నాయి. ఇందుకు అనుమతి కోరు తూ ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.
సర్కారు పట్టించుకోకపోవడం, విద్యాశాఖ దృష్టిసారించకపోవడంతో ఈ ఏడాది కాలేజీలు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. నీట్ తరహాలో బీటెక్లోనూ యాజమాన్య కోటా సీట్ల భర్తీచేస్తే బా గుంటుందన్న సూచనలు విద్యార్థి సం ఘాల నుంచి వస్తున్నాయి. దీంతో ఆ సీట్లను ఆన్లైన్లోనే భర్తీచేయనున్నా రు. దీనికి కొన్ని ప్రైవేట్ కాలేజీలు అంగీకరించినట్టు తెలిసింది. కోర్టు కేసు లు తలెత్తకుండా నోటిఫికేషన్ సమయ ంలోనే నిబంధనలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.