పాల్వంచ రూరల్, మే 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో పనిచేస్తున్న ఓ కార్మికుడికి కరోనా సోకిందనే వార్త శనివారం కలకలం సృష్టించింది.
అతడు క్వారంటైన్లో ఉండాలని కేటీపీఎస్ అధికారులు తెలిపారు. పూర్తి నిర్ధారణ కోసం బయట దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలని అధికారులు బాధితుడికి సూచించారని సమాచారం.