ఓటేసే ముందు ఒక్క నిమిషం!
ఇంటినుంచి బయల్దేరినప్పుడు పరిసరాలను పరికించు
ఇంటినుంచి బయల్దేరినప్పుడు
పరిసరాలను పరికించు
దారిపొడవునా పక్కారోడ్డు
నీ పాదాలను ముద్దాడుతున్నది
ఆ అభివృద్ధిని ఆనందించు
పచ్చని వస్ర్తాన్ని కప్పుకుని నేల,
పంటలతో కళకళలాడుతున్న చేను
నీకు నమస్కరిస్తున్నాయి.
ఆ అందాన్ని అస్వాదించు
ఒకనాడు ఎండినవాగులు
నిండునీటితో పరుగులు తీస్తూ
నీ పాదాలు కడుగుతున్నాయి
ఆ అద్భుతాన్ని అనుభవించు
ఇంటికాడ, పొలంకాడ
ఎక్కడ చూసినా
రెప్పవేయని కరెంటు
నిరంతరం కండ్లముందే ఉన్నది
ఆ వైభవాన్ని అవలోకించు
బాగైన చెరువు, బాయికాడి కరెంటు,
బాదరబందీలేని బతుకుబండి
మారిన బడి, గుడి, దవాఖాన
బీమా, పింఛన్, రేషన్
సొంతింటి సంతోషం డబుల్
తాకులాటల్లేవు, తండ్లాటల్లేవు
పల్లె పచ్చగా ఉన్నది
ఊరు ప్రశాంతంగా ఉన్నది
అభివృద్ధి కాగితాల్లో లేదు
కండ్లముందే ఉన్నది
మారిన పల్లెకు మనమే సాక్ష్యం
ఇంతకుమించిన
మార్పు ఏమున్నది?
ఆ సౌలత్లన్నీ మనం తెచ్చుకున్నవే
ఆ సంక్షేమం మనం గెలిపించుకున్నదే
ఒక్కసారి ఆలోచించు
సుపరిపాలన కావాల్నా?
సుపారి పాలన కావాల్నా?
సంక్షేమ పాలన కావాల్నా?
సఫరయ్యే పాలన కావాల్నా?
ఓటరన్నా..
నువ్వు
ఓడిపోవద్దు
తెలంగాణను
ఓడనివ్వొద్దు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

