డివైడర్ దాటుకుని కారును ఢీకొట్టిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి
Orange travels | చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అదుపుతప్పిన ఆరెంజ్ ట్రావెల్స్‌కు (Orange travels) చెందిన బస్సు
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అదుపుతప్పిన ఆరెంజ్ ట్రావెల్స్‌కు (Orange travels) చెందిన బస్సు.. అదుపుతప్పి డివైడర్ అవతలివైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. బస్సులో ఉన్న పది మంది స్వల్పంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

