హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): పేదల హృదయాల్లో దివంగత వంగవీటి మోహనరంగా చిరస్థాయిగా నిలిచారని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. హైదారాబాద్లో మంగళవారం రంగా 76వ జయంతి వేడుకల్లో పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరులోని బీఆర్ఎస్ రా ష్ట్ర కార్యాలయంలో షేక్ ఖాజావలి ఆధ్వర్యం లో రంగా జయంతిని నిర్వహించారు.