మీరు కాన్సెప్ట్ ప్రజెంట్ చేయండి.. మేం ముందుకు తీసుకువెళ్తాం: మంత్రి కేటీఆర్
Minister KTR:తెలంగాణ రాష్ట్రంలో లైంగిక నేరస్థుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునితా కృష్ణన్ చేసిన విజ్ఞప్తికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోని లైంగిక నేరాల్లో నిందితులుగా ఉన్న వారితో అమెరికా తరహాలో జాబితా తయారు చేయాలని, ఆ జాబితా ప్రజలకు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లైంగిక నేరస్థుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునితా కృష్ణన్ చేసిన విజ్ఞప్తికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోని లైంగిక నేరాల్లో నిందితులుగా ఉన్న వారితో అమెరికా తరహాలో జాబితా తయారు చేయాలని, ఆ జాబితా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సామాజిక కార్యకర్త సునిత ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
Let’s absolutely get it done. Please present the concept note and we will take it forward https://t.co/upfIM1Au0W
— KTR (@KTRBRS) October 20, 2022
రిక్రూట్మెంట్ ప్రక్రియలో సెక్స్ అఫెండర్స్ రిజిస్టర్ పనిచేస్తుందని ఆమె ఆ ట్వీట్లో అభిప్రాయపడ్డారు. నేరస్థుల జాబితాను తయారు చేసేందుకు తన వద్ద ఒక కాన్సెప్ట్ ఉందని, సుమారు 20 దేశాల్లో నిర్వహించిన పరిశోధనల ఆధారంగా ఆ విధానాన్ని రూపొందించామని, దాన్ని సమర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సునిత తన ట్వీట్లో తెలిపారు.
మంత్రి కేటీఆర్ ఇవాళ ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. లైంగిక నేరస్థుల జాబితాను కచ్చితంగా తయరు చేద్దామని కేటీఆర్ అన్నారు. అయితే దానికి సంబంధించిన కాన్సెప్ట్‌ను ప్రభుత్వానికి ప్రజెంట్ చేయాలని, ఆ కాన్సెప్ట్‌ను తాము కచ్చితంగా ముందుకు తీసుకువెళ్లనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

