హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే పా త పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు పలు సంఘా లు మద్దతు తెలిపాయి. టీజీవో సెంట్రల్ యూనియ న్ అధ్యక్షురాలు మమత,
ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, అగ్రికల్చర్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తిరుపతినాయక్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి, క్లాస్ఫో ర్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ఈ యాత్రకు మద్దతు ప్రకటించారు. సీపీఎస్ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ఆగస్టు 12న చలో హైదరాబాద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం యాత్ర పోస్టర్ను ఆవిషరించారు.