జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆరెపల్లిలో వీధి కుక్క వృద్ధుడిపై దాడి చేసి(Old man injured )గాయపరిచింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రంపిన వీరన్న ఇంటి ఎదుట కూర్చున్న సమయంలో వీధి కుక్క ఒక్కసా రి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. రోజురోజుకు కుక్కల బెడద ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవు తున్నారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు అధికారులకు మొర పెట్టుకున్నారు.
ఇంటి ముందు కూర్చున్న వృద్ధుడిపై వీధి కుక్క దాడి.. తీవ్ర గాయాలు
భూపాలపల్లి – మొగుళ్లపల్లి మండలం ఆరెపల్లికి చెందిన రంపిన వీరన్న ఇంటి ఎదుట కూర్చున్న సమయంలో వీధి కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. pic.twitter.com/k3O6Hv5EZc
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2024